FOLLOW US ON:

Get in touch!

Yousufguda, Hyderabad - 500045

shape

నియమ నిబంధనలు

  • Home
  • నియమ నిబంధనలు
  • యూనియన్ సభ్యత్వం పొందదలచిన వారు కనీసం 18 సంవత్సరాలు పైబడిన వారు ఉండవలెను. సభ్యుడికి కనీస విద్యార్హత కలిగి ఉండ 35 సంవత్సరాల పైబడిన వారికి కార్డు ఇవ్వబడుదు, ఒకవేళ ఏదైనా పరిస్థితులలో కార్డు జారీ చేసినను వారికి యూనియన్ నుండి ఎలాంటి లబ్ధి పొందలేరు.
  • ఈ యూనియన్ లో రెండు రకాల వృత్తులు ఉన్నాయి (1) మేకప్ ఆర్టిస్టు (2) హెయిర్ స్టైలిస్ట్స్, ఈ రెండు వృత్తులలో సభ్యుడు ఏదో ఒకదానికి మాత్రమే సభ్యత్వం తీసుకొని ఆమలో చివరి వరకు కొనసాగవలెను. ఎట్టి పరిస్థితులలోను రెండవ వృత్తిలో పనిచేయుటగాని మరియు సభ్యత్వం మార్చుకొనుటగాని అనర్సులు.
  • యూనియన్లో సభ్యత్వము కొరకు సభ్యుడు తన పూర్తి వివరములతో కూడిన బయోడేటాతో పాటు ఈ క్రింది పత్రములు జతపరచవలెను.

  • సభ్యుడి నాలుగు పాప్ పోర్ట్ సైజ్ ఫోటోలు
    నామిని రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
    సభ్యుడి ఆధార్ కార్డు
    నామిని ఆధార్ కార్డు.
    పర్మినెంట్ అడ్రస్సు మరియు ప్రసెంట్ అడ్రస్సు ప్రూప్ ఇవి యూనియన్ వారు పరిశీలించిన తరువాతే సభ్యత్వం ఖరారు చేసెదరు.
  • సభ్యత్వం పొందిన తరువాత 2 సంవత్సరాలు మేకప్ అసిస్టెంటు గాను, తరువాత 2 సంవత్సరాలు మేకప్ అర్టిస్టుగాను పనిచేయవలెను./li>
  • ఆ తరువాతే మేకప్ చీఫ్ గా గాని,పర్సనల్ మేకప్ అర్టిసు గా గాని చేయుటకు అర్హులు. అలాగే హైయిర్ డ్రెస్సర్ అసిస్టెంటు ఒక సంవత్సరము పనిచేయవలెను. తరువాత హైయిర్ డ్రెస్సర్ కార్డు ఇవ్వబడును.
  • సభ్యుడు ఏదైనా ఫిర్యాదు ఇవ్వదలచుకుంటే అగ్రిమెంట్ ని, లెటర్ ని, యూనియన్ వర్కింగ్ రిపోర్టుగాని ఉండవలెను. అలా లేనిచో ఫిర్యాదు తీసుకోబడదు.
  • యూనియన్ సభ్యులు నాన్ మెంబర్ తో పనిచేయించరాదు. ఫిక్షన్, నాన్ ఫిక్షన్లకు నాన్ మెంబర్లో పనిచేయించువారికి యూనియన్ వారికి యూనియన్ వారి తీసుకొనే చర్యలకు భాధ్యులు కాగలరు.
  • కనీసం 1 సంవత్సరకాలం సభ్యుడిగా ఉండి, అన్ని బకాయిలను సక్రమముగా చెల్లిస్తే తప్ప కార్మిక యూనియన్ తన సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించిన లాభాలను పొందటానికి అర్హుడు కాగలడు. 3 సంవత్సరాలు యూనియన్ చందాలు కాని, బకాయిలు ఉన్నవారు కాని యూనియన్ ఎన్నికలలో పోటీ చేయుటకు అనర్హులు.
  • చందా చెల్లించకపోవటం మేనేజింగ్ కమిటీ అనుమతి తీసుకొని ఒక సభ్యుడు 3 సంవత్సరాలు వరకు చందాలు చెల్లించనట్లయితే అతని కార్మిక సంఘ సభ్యత్వం ముగిసిపోతుంది. కానీ అతడు బకాయిలను మరియు సరిక్రొత్తగా ప్రవేశ రుసుము చెల్లించనట్లయితే తిరిగి కార్మిక యూనియన్లో చేరేందుకు అర్హత పొందగలరు.
  • ప్రతి సభ్యుడు షూటింగ్ కి వెళ్ళినది లేనిది యూనియన్ కి తెలియపరచవలెను. సభ్యుడి చిరునామా ఫోన్ నెం. మారినచో యూనియన్కు తప్పక తెలియపరచవలెను.
  • అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళిన సభ్యులు యూనియన్ కి లిఖితపూర్వకంగా తెలియపరచవలెను.
  • ఏ సభ్యులు అయిన మూడు జనరల్ బాడీ మీటింగ్స్కు హాజరుకాని ఎడల రూ. 150.లు జరిమానా చెల్లించవలెను.
  • పై వివరాలు యదార్థమని తెలుపుతూ, మన యూనియన్ నిబంధనలకు బద్ధుడనై మన ఐక్యతకూ, అభివృద్ధికి నా వంతు కృషి చేయుదనని మనస్పూర్తిగా తెలియజేస్తూ యూనియన్ సభ్యునిగా చేర్చుకోగోరుతూ సంతకం చేయడమైనది. పైన తెలియపరిచిన యూనియన్ నిబంధనలు అన్నింటికి నేను కట్టుబడి ఉంటాను. అలా లేనిచో యూనియన్ తీసుకొను ఏ చర్యకైనా నేను బాద్యుడను.